మొంథా తుఫాను కారణంగా జి. కొండూరు మండలం వెంకటాపురంలోని ఎర్రచెరువుకు పడిన గండిని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బుధవారం పరిశీలించారు. గతంలో తాత్కాలిక మరమ్మతులు చేసినా, వరద నీరు లీకై వెల్లటూరు చెరువుకు చేరుతోందని రైతులు తెలిపారు. గండిని శాశ్వత ప్రాతిపదికన పూడ్చివేసి మరమ్మతులు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.