మైలవరం మండలం చండ్రగూడెం, పొందుగుల గ్రామాల్లో మంగళవారం మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పర్యటించారు. ఈదురుగాలులు, అకాల వర్షం వల్ల దెబ్బతిన్న ఇళ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అంచనా వేశారు. అన్ని శాఖల అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.