మైలవరంలో కోతుల బెడద రోజురోజుకు ఎక్కువవుతోందని స్థానికులు ఆరోపించారు. రోడ్లపై వెళ్లే పాదచారులపై, ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలు, వృద్ధులపై కోతుల దాడులు పెరుగుతున్నాయి. పళ్ల వ్యాపారులు కూడా కోతుల దాడులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంచాయితీ, ఫారెస్ట్ అధికారులు స్పందించి, కోతులను జనావాసాల నుండి అటవీ ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.