మైలవరంలో కార్మికురాలు బిజిలి భవానిపై దాడిని ఖండిస్తూ కటారు ఉమామహేశ్వ రావును అరెస్టు చేయాలని విస్సన్నపేట సీఐటీయూ, పంచాయతీ కార్మికులు ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో నిరసన వ్యక్తం చేసారు. సీఐటీయూ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ప్రసంగించారు. మైలవరంలో మహిళ పంచాయతీ కార్మికురాలుపై ఉమామహేశ్వరం కారుతో ఢీకొట్టడమే కాకుండా కిందపడిన కార్మికురాలపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు.