జి కొండూరు మండలం కౌవులూరులో గురువారం కరెంటు షాక్ తో లారీ డ్రైవర్ గోపి మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 6గంటల నుండి ఘటన స్థలం లోనే మృతదేహం ఉండడంతో ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిఐటియు మండల కార్యదర్శి మహేష్ ఆరోపించారు. కాంట్రాక్టర్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. లేదంటే మృతదేహం తో కాంట్రాక్టర్ ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామన్నారు.