మైలవరం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారి చలి గాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ ఆకస్మిక మార్పుతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాయుగుండం కారణంగానే ఈ వాతావరణ మార్పు సంభవించినట్లు తెలుస్తోంది.