మైలవరం: 'కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి'

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఇబ్రహీంపట్నం సీఐటీయు మండల కార్యదర్శి మహేష్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా కొనసాగుతుంది. జీతాలు పెంపు కనీస వేతనం రూ. 20,000 అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్