మైలవరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పగిలిన కోడిగుడ్లను వినియోగిస్తూ వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా కోడిగుడ్డు అట్ట ₹180 ఉండగా, పగిలిపోయిన గుడ్లు అట్ట ₹100కే వస్తున్నాయని, వాటిని బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లోపించిందని, వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.