మైలవరం: పల్లె ప్రాంతాలను చుట్టుముట్టిన పొగ మంచు..

మైలవరం పరిసర ప్రాంతాలు ఆదివారం దట్టమైన పొగమంచుతో కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూరదృష్టి తగ్గడంతో వాహనాలు నడపడం కష్టమైంది. వాతావరణ శాఖ అధికారులు 19.33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. మధ్యాహ్నం 11 గంటల వరకు వాతావరణం అనుకూలంగా ఉండదని, వాహనదారులు, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా వాహనదారులు హెడ్లైట్లు వేసుకొని నిదానంగా వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్