మైలవరం: ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పివేయడం ప్రధాన కర్తవ్యం

ప్రాథమిక దశలోనే అగ్నిని ఆర్పి వేయడం ప్రధాన కర్తవ్యంగా భావించాలని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ అన్నారు. శుక్రవారం ఎన్టీటీపీఎస్ బొగ్గు సంభాళింపు విభాగంలో అగ్నిమాపక దళ విన్యాసాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కోల్ ప్లాంట్లో కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాన్ని పసికట్టిన వెంటనే ఫైర్ అలారం మోగించాలని సూచించారు. అందుబాటులో ఉన్న అగ్నిప్రమాద సాధనాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలన్నారు.

సంబంధిత పోస్ట్