రెడ్ బుక్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆదివారం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి బుర్రి ప్రతాప్ ఆరోపించారు. గుడివాడలో జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక దంపతులపై నిన్న జరిగిన దాడిని ఆయన ఖండించారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు అసభ్య పదజాలంతో దుర్భాషలాడి, కారు అద్దాలను ధ్వంసం చేయడం అమానుషం అన్నారు. సామన్య ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.