నందిగామ నగరంలో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పాత బైపాస్ పెట్రోల్ బంకు వద్ద లింగాలపాడు గ్రామానికి చెందిన మందరపు కుమారి మెడలో 30 గ్రాముల బంగారాన్ని, కేవీఆర్ కాలేజీ వద్ద కంటేటి లక్ష్మి మెడలో 30 గ్రాముల బంగారాన్ని చైన్ స్నాచర్లు లాకెళ్లారు. శుక్రవారం నాడు బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా నందిగామ పోలీసులు విచారణ చేపట్టమన్నారు.