10వ తరగతి ఫలితాల్లో "నిత్యసాత్విక" మండల స్థాయి ర్యాంక్..

మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన నిత్య సాత్విక, 10వ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో మొదటి ర్యాంకు, జిల్లా స్థాయిలో మూడవ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. మైలవరం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆమె 600కు 591 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని నిరూపించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, ఎంఈఓ బాలు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మైక్ బాబురావు నిత్య సాత్వికను సన్మానించి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్