ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 30వ తేదీనే ప్రభుత్వం అందజేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో పాటు, అదే రోజు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికారులపై పనిభారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, జనవరి 30 నాటికే సచివాలయాలకు పింఛన్ల నగదును చేరవేసినట్లు అధికారులు తెలిపారు.