వంట నిర్వాహకులను రాజకీయంగా తొలగించడం అన్యాయం: సిఐటియు

మైలవరం(M) గణపవరం జడ్పీ హైస్కూల్లో వంట నిర్వాహకుడిగా పనిచేస్తున్న తిరుపతిరావు ను తొలగించడాన్ని సీఐటీయూ మండల కార్యదర్శి సుధాకర్ అన్యాయమని అన్నారు. గురువారం ఎంఈఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికుడిగా పనిచేస్తున్న తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా అధికార పార్టీ నాయకులు తొలగించటం అన్యాయమని తిరుపతిరావు ఆరోపించారు. ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓ బాలుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్