రెడ్డిగూడెంలో టీడీపీ నాయకుల మధ్య పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటూ, వైసిపి నుండి టీడీపీలోకి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ల ద్వారా కాకుండా, వ్యక్తిగతంగా సర్వే చేసి, కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.