ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రెడ్డిగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. "డ్రైడే ఫ్రైడే " కార్యక్రమంలో భాగంగా, ఇంటి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో నీరు నిల్వలేకుండా చేసుకోవాలని తెలియజేసారు. తద్వారా వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ, చికెంగునియా, బోధకాలు, వైరల్ జ్వరాలు నుంచి కాపాడుకోవచ్చని తెలియజేసారు. పీహెచ్సి డాక్టర్ శృతి, సెక్రటరీ రామారావు పాల్గొన్నారు.