ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్లపొనికి చెట్ల కలప కొరత తీవ్రమైంది. అధిక ధరలతో కళాకారుల మనుగడకే ముప్పు వాటిల్లుతోందని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, అటవీశాఖ అధికారులను ఆదేశించి, కళాకారులకు సరిపడా చెక్కను అందించాలని సూచించారు. తద్వారా మరింత ఎక్కువగా బొమ్మలు తయారు చేస్తామని కళాకారులు విన్నవించారు.