రెడ్డిగూడెం పోలీసుల అదుపులో సస్పెండ్ అయిన టీడీపీ నేతలు

రెడ్డిగూడెంలో టిడిపి నుండి సస్పెండ్ అయిన మాజీ తెలుగు యువత అధ్యక్షుడు ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి (పెద్దబాబు), రమేష్ రెడ్డి లను మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం, ఒక వ్యక్తిపై దాడి చేసేందుకు వెంబడించడం వంటి ఆరోపణలపై వీరిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్