వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామానికి చెందిన నాగార్జున తిరుపతిరావు వైరా కట్టలేరు వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా పోలీస్, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం కంచికచర్ల మండలం గండేపల్లి లంకలో పశువుల కాపరులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.