విజయవాడ: రోడ్డుపైనే అంగన్వాడీల వంటావార్పు

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు విజయవాడలో నిరసన తెలిపారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నాచౌక్కు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు తరలివచ్చారు. కనీస వేతనం రూ. 21,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి సైతం రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్