జక్కంపూడిలో నాలుగు ఎకరాల స్థలాన్ని నకిలీ పత్రాలతో అక్రమంగా విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2004లో మైనర్‌గా ఉన్న అఖిలేష్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన భూమికి సంబంధించి ఇటీవల నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది. బెంగళూరులో నివసిస్తున్న అఖిలేష్ ఫిర్యాదు మేరకు నున్న పోలీసులు కేసు నమోదు చేశారు.