టిడిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమా, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్‌లో జగన్ రెడ్డి చేపట్టిన రైతుల పరామర్శ ర్యాలీని రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. బుధవారం గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు, విద్వేషాలు రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.