మైలవరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం గ్రామానికి చెందిన భూదేటి సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, మరో వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.