మైలవరంలోని తొమ్మిదో వార్డులో దయనీయమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నడవడానికి దారి లేక, మురుగు నీరు పోయేందుకు డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఏళ్ల నుండి పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యకు పరిష్కారం శూన్యమన్నారు. మురుగునీరు వెళ్లే పరిస్థితి లేక దుర్వాసన వచ్చి ఉండలేకపోతున్నామన్నారు. కూటమి నాయకులు స్పందించి మా సమస్య పరిష్కరించాలని కోరారు.