జోగి రమేశ్ ఇంటి వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడికి వైసీపీ శ్రేణుల యత్నం

ఇబ్రహీంపట్నంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన జర్నలిస్టులపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించాయి. ఏబీఎన్‌లో మాజీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడిన కామెంట్స్ వచ్చిన వెంటనే తమ నేత ఇంటిపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైసీపీ కార్యకర్తలను దూరంగా పంపించివేశారు. జోగి రమేశ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్