అమెరికాలో ప్రమాదం.. వీరులపాడు దంపతులు మృతి

వీరులపాడు మండలం గోకరాజుపల్లికి చెందిన దంపతులు, ఉర్తి శేషగిరిరావు, అనసూర్య అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. కొద్ది నెలల క్రితం అమెరికాలో ఉన్న తమ కుమారుడిని చూడటానికి వెళ్లిన ఈ దంపతులు, కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, 15 రోజులుగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వారి మృతదేహాలు శనివారం స్వగ్రామానికి చేరనున్నాయని బంధువులు తెలిపారు. ఈ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్