వీరులపాడు మండలం పరిధిలో ఓ వివాదం కత్తితో దాడికి దారి తీసింది. జుజ్జారు గ్రామంలో సరిహద్దు భూ వివాదం తీవ్రతరమై ఘర్షణకు దారి తీసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, జిల్లెపల్లి స్వామి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ స్వామిని కుటుంబ సభ్యులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.