డ్రగ్స్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్ఐ

వీరులపాడు మండలం జగన్నాధపురం, జమ్మవరం గ్రామాల్లో ఎస్సై అభిమన్యు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. అనంతరం ఈ రెండు గ్రామాలను మాదకద్రవ్యాల రహిత గ్రామాలుగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్