గంపలగూడెం: చర్చి మైక్ సౌండ్ తగ్గించమన్నందుకు యువకుడిపై దాడి

గంపలగూడెం మండలం తోటమూల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చర్చి మైక్ శబ్దాన్ని తగ్గించాలని కోరిన హరికృష్ణపై కొందరు గుంపుగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యలో అడ్డుకున్న రాజశేఖర్‌పైనా దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి పాస్టర్ ప్రేరణతోనే జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్