ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్.. నందిగామలో మరో దొంగతనం

నందిగామలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా, డాక్టర్ వాసుబాబు ఓల్డ్ హాస్పిటల్ సమీపంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సీత ఇంట్లోకి చొరబడిన దొంగలు, బీరువా పగులగొట్టి సుమారు 150 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్