జుజ్జూరులో 42 లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్‌కు భూమి పూజ..

వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో శనివారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రూ. 42 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ సెంటర్‌కు భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. వెల్నెస్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుతో గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రాథమిక వైద్యంతో పాటు మాతృ-శిశు సంరక్షణ, వృద్ధుల ఆరోగ్య పరీక్షలు, సాధారణ చికిత్సలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్