నందిగామ కాకాని నగరంలో బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. విభిన్న ప్రతిభను ప్రదర్శిస్తూ ఎదుగుతున్న దివ్యాంగులను సత్కరించారు. దివ్యాంగులు సమాజానికి భారమైనవారు కాదని, సరైన అవకాశాలు లభిస్తే అసాధ్యాన్ని సైతం సాధించగలరని ఆమె అన్నారు. వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజానికీ ఉందని ఆమె పేర్కొన్నారు.