కంచికచర్ల: కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కలలోని శ్రీఅంకమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శ్రీధనలక్ష్మీ అమ్మవారిగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక కుంకుమ అర్చన నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీరంగనాథ్ స్వామి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ గోగినేని రామారావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్