కంచికచర్ల: 'స్వచ్ఛ గొట్టుముక్కలకు శ్రీకారం'

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. బుధవారం వీధులను శుభ్రం చేసి, రహదారులకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. మురుగు కాలువలను శుభ్రం చేశారు. పనులను పంచాయతీ కార్యదర్శి వనిత పర్యవేక్షించారు. గురువారం సాయంత్రానికి 80 శాతం పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్