జుజ్జూరులో పిచ్చికుక్క వీరంగానికి ముగింపు పలికిన స్థానికులు!

వీరులపాడు మండలం జుజ్జూరులో శుక్రవారం అర్ధరాత్రి ఓ పిచ్చికుక్క కలకలం సృష్టించింది. ఇళ్ల బయట నిద్రిస్తున్న 10 మందిపై ఆకస్మికంగా దాడి చేసి గాయపరిచింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు ఉదయాన్నే అప్రమత్తమై, కర్రలతో ఆ కుక్కను వెంబడించి పట్టుకుని అంతమొందించారు. తమ ప్రాణ రక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నామని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్