నందిగామ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో సంభవించిన గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి 12 నుండి 1:30 గంటల మధ్యలో భారీ వర్షంతో పాటు సుడిగాలులు వీయడంతో అనేక ప్రాంతాలలో పెద్ద పెద్ద చెట్లు విద్యుత్ స్తంభాలపై కూలిపోయాయి. దీని కారణంగా పట్టణమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాంధీ సెంటర్, మెయిన్ బజార్, భారత్ సెంటర్ వంటి ప్రాంతాలలో ఫ్లెక్సీలు, షాపుల బోర్డులు ఎగిరిపోయాయి. పాత బైపాస్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.