కంచికచర్లలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు కొమ్మూరి శేషు నేతలతో కలిసి సోమవారం వీరులపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్సైని కలిసి కోరారు. కార్యక్రమంలో నాగశేషు, ఉమామహేశ్వరరావు, సూర్యదేవర ప్రణీకాంత్ పాల్గొన్నారు.