పాసింజర్లతో వెళుతూ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని కంచికచర్ల ఎస్సై రాజు హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని 65 నెంబర్ జాతీయరహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ ఫోన్ లో మాట్లాడుతూ ఆటోలు నిడిపిన డ్రైవర్ల ఫోన్లు సీజ్ చేశారు. ఆటో డ్రైవర్లు విధిగా లైసెన్సు కలిగిఉండాలన్నారు. బస్టాండ్ వద్ద ఆకతాయిగా కూర్చున్నవారిపై, ట్రాఫిక్ అంతరాయం కలిగించేవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.