హైదరాబాద్ - విజయవాడ హైవేపై నందిగామ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజులు హైవేపై వాహనాల రద్దీ ఉంటుందని, రోడ్లు వీలైనంత త్వరగా పూర్తిచేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరితే, విజయవాడకు చేరుకోవడానికి 6 గంటలకు పైగా సమయం పట్టిందని ఆయన తెలిపారు.