నందిగామ నియోజకవర్గానికి రూ. 10. 34 కోట్ల నిధులు

నందిగామ నియోజకవర్గంలో 9 తాగునీటి సరఫరా పనులకు ప్రభుత్వం రూ. 10.34 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పనులు చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ, వీరులపాడు మండలాల గ్రామాల్లో చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్