నందిగామ: ఈగల్, టాస్క్ ఫోర్స్ టీమ్లు నిత్యం తనిఖీలు చేస్తాయి

నందిగామలో డీసీపీ మహేశ్వరరాజు శనివారం క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. సబ్ డివిజన్ పోలీసులు విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈగల్, టాస్క్ ఫోర్స్ టీమ్లు నిత్యం తనిఖీలు చేస్తాయని చెప్పారు. మహిళల భద్రత, స్కూల్, కాలేజీ విద్యార్థినుల రక్షణకు శక్తి టీమ్ల నిఘా ఉంటుందన్నారు. ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏసీపీ తిలక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్