టీడీపీ నాయకులు తమ దుర్మార్గపు చర్యలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావు హెచ్చరించారు. ఆదివారం రాత్రి కంచికచర్లలో నిర్వహించిన 'బాబూ షూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నందిగామలో పీ4 పేరుతో పారిశ్రామికవేత్తల నుండి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసింది తామైతే, ఇప్పుడు వారే గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.