నందిగామలో గురువారం బాబు జగజ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్లో ఛైర్మన్ కృష్ణకుమారి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. డ్రైన్లు, సీసీ రోడ్లు, మంచినీటి పైప్లాన్లు, కరెంటు స్తంభాల ఏర్పాటు, టిడ్కో ఇళ్లు, తదితర అంశాలకు సంబంధించి 43 అంశాలకు ఆమోదం తెలిపారు. కౌన్సిలర్లు పలు సమస్యలపై వాదించారు. ఛైర్మన్, కమిషనర్ లోవరాజు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.