నందిగామ: చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరు

వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడూ పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలవలేదని, గతంలో ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దూషించి ఇప్పుడు తిరిగి పొత్తు పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఐటీ రంగానికి పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని, చంద్రబాబు కేవలం క్రెడిట్ కొట్టేస్తున్నారని అరుణ్ కుమార్ ఆరోపించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్