నందిగామ మండలం తక్కెళ్ళపాడులో బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్.. కూటమి నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతి ఇంటిలోనూ సుపరిపాలన ప్రయోజనాలు చేరవేయడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సమస్యలను పరిష్కరించి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.