నందిగామ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఆర్డీవో బాలకృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 20 దరఖాస్తులు వచ్చాయని, రెవెన్యూ, సర్వే, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు.