నందిగామ మండలం రాఘవపురం కొండలొ మంగళవారం అర్థరాత్రి గ్రావెల్ తవ్వకాల్లో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన టిప్పర్ డ్రైవర్ దాసరి చిన వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సీపీఎం, సీఐటీయు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద మృతుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని బుధవారం ధర్నా నిర్వహించారు.