ఆదివారం నందిగామలో జరిగిన సమావేశంలో, నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ సెల్ నాయకులు వర కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబుపై సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడటం అంబటి రాంబాబు అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.