జాతీయ స్విమ్మింగ్ పోటీలకు నందిగామలోని ఒక స్కూల్ విద్యార్థి కీర్తన్ 50మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో ఎంపికయ్యాడు. గుజరాత్లోని అహ్మదాబాద్ నరసరావుపూర్ స్పోర్ట్స్ క్లబ్లో ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే 51వ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈపోటీలను ఎస్ఎఫ్ఎ సిమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా కీర్తన్ కు విద్యాసంస్థల ఛైర్మన్ రవీంద్రనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.